లీజు భూమికి, సొంత భూమికి తేడా తెలీని అవివేకి
మేం తెచ్చిన పాలసీ సొంతభూముల్లో కన్వర్షన్ చార్జీల కోసమే…
2023లో లీజు భూముల్ని రెగ్యులరైజ్ చేస్తూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు జీవోలు తెచ్చింది
ఆమాత్రం సోయిలేకుండా ఆరోపణలు సరికాదు
సీఎం కుటుంబసభ్యుల ప్రయోజనాలుంటే ఆధారాలు ఇవ్వాలి : మాజీమంత్రి కేటీఆర్‌పై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఫైర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రగతికి అడ్డుపడుతూ, పారిశ్రామికవేత్తల్ని బెదిరించే ధోరణిలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు మాట్లాడటం సరికాదని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) నుంచి పరిశ్రమల స్థాపన కోసం పారిశ్రామికవేత్తలు గతంలో భూములు కొనుగోలు చేశారని తెలిపారు. కాలక్రమంలో ఆ పరిశ్రమలు జనావాసాల మధ్యకు రావడం, కాలుష్య కారణాలతో అనేక పరిశ్రమలు మూతపడ్డాయని వివరించారు. ఆ భూములు ఇప్పటికీ పారిశ్రామిక జోన్ పరిధిలో ఉన్నాయనీ, వాటిని ఇతర వాణిజ్య, గృహ అవసరాలకోసం వినియోగించుకొనే అవకాశం కల్పిస్తూ, జోన్ మార్పును సూచిస్తూ ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుందని తెలిపారు. దానికోసం 80 అడుగులు వెడల్పు రోడ్డు ఉన్న భూముల జోన్‌మార్పు కోసం 50 శాతం, అంతకంటే తక్కువ వెడల్పు ఉన్న రోడ్డుకు అనుసంధానంగా ఉన్న భూములకు 30 శాతం మేరకు కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ చార్జీలు నిర్ణయించామన్నారు.
దీనివల్ల పారిశ్రామికవేత్తలకు, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందనే ఉద్దేశ్యంతోనే ఈ పాలసీ తెచ్చామన్నారు. అంతేతప్ప ఇది భూముల్ని అమ్ముకోవడం కాదని వివరణ ఇచ్చారు. 2023లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అజామాబాద్ సహా పలు పారిశ్రామిక ప్రాంతాల్లోని లీజు భూముల్ని క్రమబద్ధీ కరించేందుకు మూడు జీవోలు తెచ్చిందని గుర్తుచేశారు. మాజీ మంత్రి కేటీఆర్ లీజు భూముల క్రమబద్ధీకరణ, సొంత భూముల కన్వర్షన్‌కు తేడా తెలియని అవివేకి అని విమర్శిం చారు. లక్షల కోట్ల కుంభకోణానికి ప్రభుత్వం పాల్పడుతోందనీ, దానికోసం సీఎం కుటుం బసభ్యులు ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్నారంటూ కేటీఆర్ నోటికొచ్చినట్టు దుష్ప్రచారం చేస్తూ, ప్రజల్లో ఆందో ళన రేకెత్తించాలని ప్రయత్ని స్తున్నారని చెప్పారు. ప్రభుత్వం పరిశ్రమలకు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కు లు కల్పిస్తూ ‘ఫ్రీహౌల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టులో మూడు ఉత్తర్వులు ఇచ్చింది వారి ప్రభుత్వ హయాం లోనేనని స్పష్టం చేశారు. శుక్రవారంనాడిక్కడి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడారు.
మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. కేటీఆర్ చెప్త్తున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించిన భూమి 4,740 ఎకరాలు మాత్రమేననీ, మిగిలిన భూమి రోడ్లు, డ్రెయినేజి వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టీజీఐఐసీ వినియోగించిందని తెలిపారు. పారిశ్రామికాభివృద్ధి కోసం భూ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదనీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇచ్చినవేనని చెప్పారు. ఆజమాబాద్, కూకట్‌పల్లి, హఫీజ్‌పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హౌల్డ్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేన్నారు. దానికోసం 2023 ఆగస్టు 29 ఇండిస్టీస్ అండ్ కామర్స్ డిపార్ట్‌మెంట్, జీఓ ఎమ్‌ఎస్ 19, 20, 21 లను కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే జారీ చేశారని వివరించారు. తాము ఆ భూములకు కన్వర్షన్ అవకాశం మాత్రమే కల్పిస్తున్నామనీ, ఈనెల 17 న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో ఇంపాక్ట్ పీజు నిర్ణయం జరిగింద న్నారు. 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు పారిశ్రామిక వాడల్లోని భూములకు ఫ్రీహౌల్డ్ హక్కులు కల్పించినప్పుడు వారు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసు కున్నారో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ప్రశ్నించారు.
పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం ఫీజులు కట్టాలని లీజు భూములకు జీవోలు ఎవరిచ్చారని అడిగారు. అందరూ దరఖాస్తులు చేసుకుంటే భూముల కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం ప్రభు త్వానికి వస్తుందని భావిస్తున్నామనీ, యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్‌కు దరఖాస్తు చేసుకోలేరని వివరణ ఇచ్చారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేండ్లు రాష్ట్రంలో ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే, రెండేండ్లుగా దాన్ని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్) లోపల ఉన్న పరి శ్రమలను వెలుపలకు తరలిస్తామని మొదటి నుంచి చెప్తున్నామన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షిం చేందుకు కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించి, 20 ఏండ్లపాటు విద్యుత్, పన్ను రాయితీలను ఇస్తున్నాయని చెప్పారు. కానీ తెలంగాణలో భూముల విలువ ఎక్కువ, లభ్యత తక్కువగా ఉన్నందున దానికి అనుగుణంగానే విధాన నిర్ణయాలు తీసుకుంటున్నామని వివరించారు.
కేటీఆర్‌వన్నీ అబద్ధాలే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



