– 23లోపు వివరణకు అవకాశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
స్టేషన్‌ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి శుక్రవారం అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కలిశారు. తనకు ఇచ్చిన నోటీసుల గురించి స్పీకర్‌తో చర్చించారు. ఈ నెల 23లోపు ఫిరాయింపు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని స్పీకర్ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులకు సమాధానాలు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. ఈ నెల 23 లోగా సమాధానాలను అఫిడవిట్ రూపంలో స్పీకర్ కార్యాలయంలో అందజేయాలని వాటిలో సూచించారు. గత ఆగస్టులో ఫిర్యాదులొచ్చిన 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. వారిలో దానం, కడియం మినహా ఎనిమిది మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు. అనంతరం విచారణ సైతం జరిగాయి. ఎమ్మెల్యేల తరఫున న్యాయవాదులు, పిటిషన్ల తరఫు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామిన్ చేశారు. దానం, కడియం విషయంలో కూడా అదే ప్రక్రియను అనుసరించనున్నారు.
స్పీకర్‌ను కలిసిన కడియం శ్రీహరి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



