బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేక భాషల్లో బాగా మాట్లాడుతారనీ, ఇండియా, తెలంగాణ గురించి అంతర్జాతీయ వేదికల మీద బ్రహ్మాండంగా వివరిస్తారనీ, అందుకే ఆయనపై సీఎం రేవంత్‌రెడ్డి కక్ష కట్టారని బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఎట్టకేలకు కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి తెచ్చుకున్నాయని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు ఎఫ్‌ఐఆర్‌లో అవినీతి ప్రస్తావన లేదన్నారు. అభద్రతా భావంతోనే రేవంత్‌రెడ్డి కేసు పెట్టారని చెప్పారు. మంకీమ్న్ బయో అనే కంపెనీతో జూన్‌లో రూ.345 కోట్ల పెట్టుబడుల ఒప్పందాన్ని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కుదుర్చుకుందని వివరించారు. యతిరాజం మధుశేషు అనే చార్టర్డ్ అకౌం టెంట్ పేరుతతో ఆ కంపెనీని కేవలం రూ.లక్ష మూల ధనంతో రిజిస్టర్ చేశారని అన్నారు. రూ.లక్ష మూలధనం ఉన్న కంపెనీతో రూ.345 కోట్ల ఒప్పందాన్ని ఎలా కుదుర్చుకుంటారని ప్రశ్నించారు. బ్లాక్ మనీని వైట్‌గా మార్చుకునే కుట్ర దీని వెనక ఉందనీ, దీనిపై దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. పెట్టుబడులు తెచ్చిన కేటీఆర్‌పై అక్రమ కేసులు పెడుతున్న ఈ ప్రభుత్వం బోగస్ పెట్టుబడుల ఒప్పందాలకు గ్రీన్‌సిగల్ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి,0 మంత్రివర్గంపై కేసులుండవా?అని ప్రశ్నించారు.
కేటీఆర్‌పై రేవంత్‌రెడ్డి కక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



