ఇద్దరి ప్రాణం తీసిన రాంగ్‌రూట్ డ్రైవింగ్
పలువురికి గాయాలు
మొయినాబాద్ పరిధిలో ఘటన
నవతెలంగాణ-మొయినాబాద్
రాంగ్ రూట్ ప్రయాణం ఇద్దరి ప్రాణం తీసింది.. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు.. నేరుగా వచ్చిన మరో కారును ఢకొీట్టింది. ఇద్దరు మృతి చెందారు.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూర్‌కు చెందిన వంశీధర్‌రెడ్డి, ఆయన అత్త సుజాత, బంధువు రోజా డ్రైవర్ వెంకట్‌తో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో మొయినాబాద్‌లోని పెంటయ్య హోటల్ దగ్గరకు రాగానే.. హైదరాబాద్ నుంచి కేతిరెడ్డిపల్లి సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో ఫొటో షూట్ కోసం వెళ్తున్న ఓ కారు రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చి వంశీధర్‌రెడ్డి కారును ఢకొీట్టింది. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు డ్రైవర్ కరీమ్(37) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. అదే కారులో ఉన్న లోకేష్(24)కు తీవ్ర గాయాలు కావడంతో భాస్కర్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చనిపోయాడు. ఈ ప్రమాదంలో బాబురావు, అఖిల్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అలాగే మరో కారులో ఉన్న వంశీధర్‌రెడ్డి, ఆయన అత్త సుజాత, బంధువు రోజా, డ్రైవర్ వెంకట్ కూడా గాయపడటంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వంశీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



