Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅప్పుడే కళ్లు తెరిచి.. అంతలోనే కనుమూసి

అప్పుడే కళ్లు తెరిచి.. అంతలోనే కనుమూసి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. సారంగాపూర్‌ మండలానికి చెందిన దంపతులకు శుక్రవారం సాయంత్రం పండంటి బాబుకు జన్మనిచ్చారు. ఆరోగ్యంగా జన్మించిన ఆ శిశువును శుభ్రం చేసి, వైద్య పరీక్షలు నిర్వహించడం కోసం స్థానికంగా ఉన్న ఓ పిల్లల ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాబును బెడ్‌పై ఉంచి క్లీనింగ్‌ కోసం నర్సు తగిన ఏర్పాట్లు చేస్తున్న సమయంలో.. ఆ గదిలో ఉన్న ర్యాక్‌ (కప్‌బోర్డు) హఠాత్తుగా కూలి బాబుపై పడింది. దీంతో శిశువు అక్కడికక్కడే మృతి చెందాడు. డెలివరీ అయిన గంటల వ్యవధిలో తమ కుమారుడు చనిపోయాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోయారు. పుట్టిన పిల్లాడిని తనివితీరా కళ్లారా చూసుకోకముందే శ్మశనానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని కన్నీరుమున్నీరయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -