Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జిల్లాస్థాయి చెకుముకి పోటీలకు శ్రీవిశ్వభారతి విద్యార్థులు

జిల్లాస్థాయి చెకుముకి పోటీలకు శ్రీవిశ్వభారతి విద్యార్థులు

- Advertisement -

 నవతెలంగాణ- ఆత్మకూరు 
ఆత్మకూరు మండలం అగ్రంపహడ్ గ్రామ పరిధిలోని శ్రీ విశ్వభారతి హైస్కూల్ విద్యార్థులు చెకుముకి పరీక్షలో ప్రతిభ కనబరిచి మండల స్థాయిలో ప్రధమ బహుమతి సాధించారు. ఈ విజయంతో వారు జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఈఓ విజయ్‌కుమార్, జెడ్‌పీహెచ్‌ఎస్ కాంప్లెక్స్ హెడ్‌మాస్టర్ నిర్మల కుమారి, సైన్స్ విభాగ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభను ప్రశంసించిన అధికారులు, జిల్లా స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయంపై పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్విబి స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -