నవతెలంగాణ-బెజ్జంకి
సృష్టికి మూలం మహిళయేనని, జన్మనిచ్చిన మాతృత్వాన్ని గౌరవించడమే కాంగ్రెస్ ప్రభుత్వధ్యేయమని, మహిళా సాధికారతకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి, మొట్టమొదట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కలిగించి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనాధికారం చేపట్టిందని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు ఏర్పాటుచేసిన ఇందిర మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. మహిళ శక్తితో కుటుంబం అభివృద్ధి సాధిస్తుందని, మహిళలు స్వసక్తితో ఆర్థికంగా పురోగతి సాధించాలని ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
మహిళ సంఘాల సభ్యులతో పాటు సంఘాల్లో లేని మహిళలను ఒక సంఘంగా ఏర్పాటుచేసి ఇందిరమ్మ కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ ఇందిర మహిళ శక్తి చీరలను పంపిణీ చేయాలని అధికారులను అధేశించారు. అనంతరం మండలంలోని అయా గ్రామాల మహిళలకు ఎమ్మెల్యే మహిళ శక్తి చీరలను పంపిణీ చేశారు. తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ప్రవీన్, ఏపీఎం పర్శరాములు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, ఏఎంసీ చైర్మన్ పులి క్రిష్ణ, మండలాధ్యక్షుడు ముక్కీస రత్నాకర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు లింగాల శ్రీనివాస్,మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, నాయకులు శానగొండ శరత్, గూడెల్లి శ్రీకాంత్, బైరి సంతోష్, ఐలేని మహేందర్ రెడ్డి, అయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వీఓఏలు, మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



