- Advertisement -
నవతెలంగాణ -భిక్కనూర్
విద్యార్థులకు సరైన విద్యాబోధన అందించాలని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ప్రసూన దేవి తెలిపారు. శనివారం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందించే విద్యాబోధన, విద్యావ్యవస్థలో వివిధ మార్పులకు ఏ విధంగా విద్యాబోధన చేయాలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు గోపికృష్ణ, మైపాల్ రెడ్డి, పి ఆర్ టి యు మండల జనరల్ సెక్రటరీ శ్రీపాల్ రెడ్డి, సి అర్ పి లు, తదితరులు ఉన్నారు.
- Advertisement -



