డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ రోహిత్
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో కోటి 43 లక్షలతో నిర్మించిన ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం భవనం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతున్నది. ఈ నెల 24న జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభం కానున్నది. ప్రారంభోత్సవ ఏర్పాట్లను జిల్లా డిప్యూటీ డీఎంహెచ్వో రోహిత్, బీర్కూర్ డాక్టర్ శ్రీలేఖ లు శనివారం నసురుల్లాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి పనులను పరిశీలించారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో మౌలిక సదుపాయాలు, ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లపై సిబ్బందితో చర్చించారు. సోమవారం నసురుల్లాబాద్ ప్రభుత్వం ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మండల పరిధిలో విజయవంతం చేయాలని, మండల స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు అధికారులు సకాలంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వీరి వెంట డాక్టర్ నాగ గిరీష్, ఆరోగ్య అధికారి దయానంద్ సూపర్వైజర్లు సుశీల, నర్సవ్వ, కార్యకర్త వెంకట లక్ష్మి ఆశ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.



