Saturday, November 22, 2025
E-PAPER
Homeఖమ్మంవ్యవసాయ శాస్త్రవేత్తలే ఆహార సంపద సృష్టికర్తలు

వ్యవసాయ శాస్త్రవేత్తలే ఆహార సంపద సృష్టికర్తలు

- Advertisement -

– ఏడీ డాక్టర్ హేమంత కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఆహార సంపద సృష్టికర్తలు వ్యవసాయ శాస్త్రవేత్తలే నని స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా,సత్తుపల్లి మండలం,రేజర్ల కు చెందిన న్యూ సాంగ్ కమ్యూనిటీ స్కూల్ 8,9,10 వ తరగతుల విద్యార్థులు శనివారం అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలను ఎక్స్పోజర్ విజిట్ లో భాగంగా సందర్శించారు.

దీనిలో భాగంగా వారు పంటల సాగు, బిందు,తుంపర్ల సేద్యం, పెరటి తోటలు నిర్వహణ, సేంద్రీయ వ్యవసాయ పద్ధతులు, ఇంకుడు గుంతలు ఏర్పాటు,కృత్రిమ పుట్టగొడుగుల పెంపకం,పలురకాల కంపోస్ట్ ఎరువులు తయారీ గురించి తెలుసుకున్నారు.తర్వాత వ్యవసాయ కళాశాలలోని పలు ప్రయోగ శాలలు ను చూసి అక్కడ చేసే పరిశోధనల గురించి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జే.హేమంత కుమార్ విద్యార్థులు భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్తలు గా ఎదగాలని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ కార్యక్రమాన్ని కళాశాల ఆచార్యులు డాక్టర్ నీలిమ, డాక్టర్ దీపక్ రెడ్డి,డాక్టర్ శ్రావిక, డాక్టర్ దుర్గ సమన్వయ పరిచారు. కళాశాలను సందర్శించి పంటల పెంపకం, ప్రయోగశాలలను చూడడంతో తమకు వ్యవసాయం పట్ల ఎంతో ఆసక్తి కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్ధులతో పాటు పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -