నవతెలంగాణ – నసురుల్లాబాద్
విద్యార్థులకు ఎన్నికలపై అవగాహన ఉండాలని, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని నసురుల్లాబాద్ మండల విద్యాధికారి చందర్ అన్నారు. శనివారం నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరగబోయే స్థానిక ఎన్నిక దృష్టిలో ఉంచుకొని గ్రామ సర్పంచ్ వార్డు ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడం అవగాహన కల్పించారు. ఇందులో సర్పంచ్, వార్డ్ మెంబర్ల ఎన్నిక విధానం పై అవగాహన కల్పించారు.
అనంతరం సర్పంచ్, వార్డు మెంబర్ ల పదవికి ఇరువురు నామినేషన్ ఉపసంహరణ ప్రచారం, ఎన్నికల నిర్వహణ అవగాహన కల్పించారు. ఎన్నికల నిర్వహణ అధికారి పర్యవేక్షించారు. అనంతరం సర్పంచుకు ఇరువురు పోటీ పడగా వాడు మెంబర్ కూడా ఇరువురు పోటీపడ్డారు ఇందులో తనకు నచ్చిన వారిని ఎన్నుకోవాలని విద్యార్థులకు సూచించారు. పాఠశాలలో విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థి దశ నుంచే ఎన్ని కలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ప్రజా పద్ధ తిలో ఎన్నికలు నిర్వహించామని ఎంఇఓ చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



