నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని పీహిస్సీని జిల్లా డిప్యూటీ డిఎం మైండేట్లో సుధాకర్ నాయక్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి సిబ్బందికి ఏఎన్ఎం ఆశా కార్యకర్తలకు పలు సూచనలు సలహాలు చేశారు. టీబీ, ఫైలేరియా, లెప్రసి ,సికిల్ సెల్ వ్యాధులపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందికి అవగాహన కల్పించారు. ప్రజలకు టీబి పై అవగాహన కల్పించాలని టిబి లక్షణాలను ఉన్న కేసులను గుర్తించి ఆస్పత్రికి పంపించాలని, పైలేరియా వ్యాధులను, లేప్రసి వ్యాధులను క్షేత్రస్థాయిలో గుర్తించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ లక్ష్మి, శ్రీనివాస్ హెచ్ఈఓ, లక్ష్మి సూపర్వైజర్ ఎంఎల్ హెచ్పిలు, హెల్త్ అసిస్టెంట్లు ఏఎన్ఎం లు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
జన్నారం పిహెచ్ సీని సందర్శించిన డిప్యూటీ డీఎంఅండ్ హెచ్ఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



