సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అవుతా సైదులు
నవతెలంగాణ – హాలియా
యావత్ కార్మిక వర్గాన్ని పొట్ట కొట్టే విధంగా 29 కార్మిక చట్టాన్ని రద్దుచేసి బడా పెట్టుబడిదారుల కు కేంద్ర బిజెపి ప్రభుత్వం కొమ్ముకాస్తుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. హాలియాలో జరిగిన సిఐటియు ఆరవ మండల మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎందరో ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న ఈ చట్టాలను రద్దుఅవటం వలన చిన్న పరిశ్రమల్లో తనిఖీలు ఉండవు. యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తారు. ఫిక్స్డ్ వేతనం పేరుతో పని గంటలు పెంచుతూ కార్మికులకు ఎట్టి చేయించే విధంగా చట్టాలను తెచ్చారన్నారు.
నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దించే వరకు కార్మిక వర్గ ఐక్యతతో ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈనెల 26న సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు తలపెట్టిన ఆందోళన కార్యక్రమంలో కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున హాజరై జయప్రదం చేయాలన్నారు. అనంతరం అనుముల మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల కన్వీనర్ గా రేబెల్లి వెంకటేశ్వర్లతో పాటు మరో పదహారు మంది కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహా కార్యదర్శి పత్తి శ్రీనివాస్ రెడ్డి సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు షేక్ బషీర్ నాయకులు పొదిలి వెంకన్న అన్నపాక శ్రీను ఎస్.కె చాంద్బాషా బూరుగు వెంకన్న తోటిపల్లి వెంకటయ్య నరసింహ సైదమ్మ శంకర్ తదితరులు ఉన్నారు.



