Saturday, November 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భారత రాజ్యాంగమే మాకు రక్షణ..

భారత రాజ్యాంగమే మాకు రక్షణ..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి
నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే రాజ్యాంగ దినోత్సవ ర్యాలీని విజయవంతం చేయాలని వక్తలు పేర్కొన్నారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబు జగ్జీవన్ భవనంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పలువురు పాల్గొని మాట్లాడుతూ.. ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగం ని గౌరవించాలని భారత రాజ్యాంగమే మాకు రక్షణ లాంటిది అని అన్నారు. ఈ దినోత్సవ ర్యాలీ కి అంబేద్కర్ వాదులు, ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ, ప్రజా సంఘాల నాయకులు తరలిరావలన్నారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు బట్టు రామచంద్రయ్య, దొనకొండ రాములు, పొత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్, బర్రె సుదర్శన్, బండారు రవి వర్ధన్, దుబ్బ రామకృష్ణ మాదిగ, బసాని మహేందర్, పడిగల ప్రదీప్, బర్రె నరేష్, కనుకుంట్ల రమేష్, బండారు జహంగీర్, మంద శివ, అందే సాయి  పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -