- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి మూడో రోజు విచారణ ముగిసింది. రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల కస్టడీకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు అతడిని కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. మూడో రోజు విచారణలో భాగంగా రవికి ఏజెంట్లు, గేమింగ్ యాప్‌ల నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. మన దేశంతో పాటు విదేశాల్లో ఉన్న లింకులు, ఆస్తులపై కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
- Advertisement -



