Saturday, November 22, 2025
E-PAPER
Homeతాజా వార్తలుపక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

పక్కా మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

- Advertisement -

హరీష్‌ కళ్యాణ్‌ కథానాయకుడుగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ ‘దాషమకాన్‌’. ఐడీఏఏ ప్రొడక్షన్స్‌, థింక్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను వినీత్‌ వరప్రసాద్‌ స్వీయ దర్శక నిర్మాణంలో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమా టైటిల్‌ ప్రోమోను మేకర్స్‌ శనివారం విడుదల చేశారు. ఊర్లో పేరు మోసిన రౌడీకి చెందిన కిరాయి మనుషులను హీరో ఎలా ఆడాటించాడు వంటి సీన్‌తో టైటిల్‌ ప్రోమో ఇంట్రెస్టింగ్‌గా ఉంది. హరీష్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు చేసిన పాత్రలకు పూర్తి భిన్నమైన రోల్‌ ఇది. పక్కా మాస్‌ యాక్షన్‌ మూవీగా కనిపిస్తోంది. టైటిల్‌ ప్రోమోలో చేతిలో చురకత్తి తిప్పుతాడు హీరో. అది చేతిలో పాటలు పాడే మైక్‌లా మారిపోతుంది. అంటే ఈ సినిమాలో హీరో పాత్రలో రెండు షేడ్స్‌ ఉంటాయనేది తెలుస్తోంది.

ఓ షేడ్‌లో పాటలు పాడితే.. మరో షేడ్‌లో మాస్‌ అవతార్‌లో యాక్షన్‌తో దుమ్మురేపుతుంటాడు. మరి ఈ రెండు షేడ్స్‌ వెనుకున్న అసలు కథ తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. హరీష్‌ కళ్యాణ్‌ సరసన ప్రీతి ముకుందన్‌ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో సత్యరాజ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి నిర్మాత: వినీత్‌ వరప్రసాద్‌, రచన, దర్శకత్వం : వినీత్‌ వర ప్రసాద్‌, సంగీతం: బిట్టో మైకేల్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ అశోకన్‌, ఎడిటర్‌: జి.మదన్‌, సౌండ్‌ డిజైన్‌: తపస్‌ నాయక్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ : మణిమొళైన్‌ రామదురై, కొరియోగ్రఫీ: రాజు సుందరం, బాబా భాస్కర్‌, అమిర్‌, స్టంట్స్‌: ఓం ప్రకాష్‌, దినేష్‌ సుబ్బరాయన్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉదయ కుమార్‌ బాలాజీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -