చట్నీ, సాంబార్
టీచర్: 5-5 ఎంత అవుతుంది?
టీచర్ ప్రశ్నకు విద్యార్థి మౌనంగా ఉంటాడు.
టీచర్: సరే విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
విద్యార్థి: సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్.
ఎలుకల మందు
వరమ్మ: అంత ఆరోగ్యంగా ఉన్న మీ ఆయన్ను అకస్మాత్తుగా ఆస్పత్రికి ఎందుకు తీసుకుని వెళ్లారు వదినా..
సుశీలమ్మ: ఆయన ఇంట్లోకి వస్తూనే కడుపులో ఎలుకలు పరుగెత్తుతున్నాయని గట్టిగా అరిచారు, వదినా.. ఎలుకలను చంపుదామని అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టా.. అంతే..
వాళ్ళు డబ్బున్నోళ్ళే తల్లీ
సుందరి : రోజా.. ఇది విన్నావా? పక్కింటి పంకజం వాళ్ళాయన కోమాలోకి వెళ్ళిపోయాడట!
రోజా : వాళ్ళు డబ్బులున్నోళ్లే తల్లీ ఎక్కడికైనా వెళ్తారు..!
ఎవరూ లేరు
రాకేష్: నాకు రైల్లో నిద్ర పట్టలేదురా…
సురేష్: ఎందుకు…
రాకేష్: అప్పర్ బర్త్ వచ్చింది..
సురేష్: ఎవరితోనైనా ఎక్స్‌చేంజ్ చేసుకోలేకపోయావా…
రాకేష్: చేసుకుందామంటే కింది బెర్త్‌లో ఎవరూ లేరు..
బంగారు దంతాలు
పోలీసు: నీ కళ్ల ముందే దొంగలు ఇళ్లు దోచుకుపోతుంటే నువ్వు అరవకుండా ఎలా చూస్తూ కూచున్నావయ్యా… అరిచి ఉంటే ఎవరైనా వచ్చి ఉండేవారు కదా.
వ్యక్తి: అరిస్తే నా నోట్లోని బంగారం దంతాలు బయటపడుతాయని నోరు తెరవలేదు.
మరి బర్రెలిస్తే…
సుజాత: మా ఆయన ఆవులిస్తే పేగులు లెక్కపెడుతాడు, తెలుసా..
స్రవంతి: అబ్బో… భలే చెప్పావులే… మరి బర్రెలిస్తేనో….
ఉప్పు మసాలా కర్రీ
భర్త: ఛీ.. ఏంటీ ఈరోజు కూరలో ఉప్పు మరీ ఎక్కువైంది?
భార్య: లేదండీ.. ఈరోజు నేను చేసిందే ఉప్పు మసాలా కర్రీ.
నవ్వుల్ పువ్వుల్
- Advertisement -
- Advertisement -



