ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
సిడ్నీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ సంచలనం సృష్టించాడు. కెరీర్‌లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన సెమీఫైనల్లో తనకంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న చైనీస్ తైపీకి చెందిన ఛౌ-టిన్-చెన్‌ను చిత్తుచేశాడు. దీంతో ఈ ఏడాదిలో రెండోసారి ఒక టోర్నమెంట్ ఫైనల్‌కు చేరాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఒలింపిక్ పార్క్ స్పోర్ట్స్ సెంటర్‌లో జరిగిన సెమీస్‌లో లక్ష్యసేన్ 17-21, 24-22, 21-16తో దాదాపు గంటా 26 నిమిషాలసేపు పోరాడి ఛౌ-టిన్‌కు చెక్ పెట్టాడు. దీంతో ముఖాముఖి పోరును 4-4తో సమం చేశాడు. ఈ ఏడాది జరిగిన హాంకాంగ్ ఓపెన్‌లోనూ లక్ష్యసేన్ 23-21, 22-20తో ఛౌ-టిన్-చెన్‌ను చిత్తుచేశాడు. ఆదివారం జరిగే ఫైనల్లో ప్రపంచ 12వ ర్యాంకర్, జపాన్‌కు చెందిన 26వ ర్యాంకర్ యాషీ తనకతో తలపడనున్నాడు. రెండో సెమీస్‌లో యాషీ తనక 21-18, 21-15తో 5వ ర్యాంకర్, చైనీస్ తైపీకి చెందిన లిన్-చౌన్-హీను ఓడించాడు. తొలిరౌండ్‌లో యుషీ టాప్‌సీడ్ జొనాథన్ క్రిస్టీ, క్వార్టర్స్‌లో రాస్మస్ జెంకే(డెన్మార్క్)లను చిత్తుచేసి టాప్ ఫామ్‌లో ఉన్నాడు.



