Sunday, November 23, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంవజ్రేష్‌ యాదవ్‌కే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పగ్గాలు

వజ్రేష్‌ యాదవ్‌కే మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా పగ్గాలు

- Advertisement -

బలమైన బీసీ నేతకు కాంగ్రెస్‌ ప్రాధాన్యత
నవతెలంగాణ-బోడుప్పల్‌
మేడ్చల్‌ మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షునిగా తోటకూర వజ్రేష్‌ యాదవ్‌కు కాంగ్రెస్‌ పార్టీ అవకాశం కల్పించింది. జిల్లాలో పలువురు డీసీసీ కోసం తీవ్రంగా పోటీపడగా వజ్రేష్‌ యాదవ్‌కే అధిష్టానం మొగ్గు చూపింది. జిల్లాలో బలమైన యాదవ సామాజిక తరగతితో పాటు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ప్రధాన అనుచరునిగా వజ్రేష్‌ యాదవ్‌కు పేరుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున మేడ్చల్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడినా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో ముందు వరుసలో ఉంటున్న అంశం అందరికీ తెలిసిందే. అంతే కాకుండా భవిష్యత్తులో మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీని బలమైన శక్తిగా తీర్చిదిద్దాలంటే వజ్రేష్‌ యాదవ్‌ లాంటి సమర్థు లకే డీసీసీ పగ్గాలు అప్పగించాలని అధిష్టానం భావించి ఆయనకు పగ్గాలు అప్పగించింది. దాంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -