Sunday, November 23, 2025
E-PAPER
Homeబీజినెస్అమెజాన్‌లో మళ్లీ కోతలు

అమెజాన్‌లో మళ్లీ కోతలు

- Advertisement -

1800 మంది ఇంజనీర్లకు ఉద్వాసన
న్యూయార్క్‌ : దిగ్గజ కంపెనీల్లో ఉద్వాసనలు కొనసాగుతున్నాయి. కృత్రిమ మేధా (ఎఐ)పై భారీగా ఖర్చు చేస్తోన్న నేపథ్యంలో ఉద్యోగాల తొలగింపునకు పాల్పడుతోన్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా అమెజాన్‌లో 1800 మంది ఇంజనీర్లను రోడ్డున పడేసింది. ఇప్పటికే 14,000 పైగా కార్పొరేట్‌ ఉద్యోగాలను తొలగించనున్నట్లు గత అక్టోబర్‌లో ఆ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. క్లౌడ్‌ సర్వీసెస్‌, రిటైల్‌, అడ్వర్టైజింగ్‌, గ్రోసరీ విభాగాల్లోని సిబ్బంది ఉద్వాసనకు ప్రణాళికలు వేసింది. ఇందులో భాగంగా తాజాగా ఇంజినీర్ల బృందంలోని 1800 మందిని తొలగించింది. న్యూయార్క్‌, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్‌ రాష్ట్రాల్లో 4,700 మందికిపైగా ఉద్వాసనల జాబితాలో ఉంటే.. అందులో 40 శాతం మంది ఇంజినీర్లే ఉండటం గమనార్హమని సిఎన్‌బిసి ఓ రిపోర్ట్‌లో పేర్కొంది. మిగతా రాష్ట్రాల్లోనూ అమెజాన్‌ తమ తొలగింపుల డేటాను వెల్లడిస్తే ఏఏ విభాగాల్లో ఎంతమందిని తొలగిస్తున్నారనే దానిపై స్పష్టత రానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -