Sunday, November 23, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో తగ్గిన చలి..

తెలంగాణలో తగ్గిన చలి..

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : రాష్ట్రంలో కోల్డ్​వేవ్‎కు బ్రేక్​పడింది​. 12 రోజుల పాటు విపరీతమైన చలి వాతావరణం ఉండగా.. శుక్రవారం నుంచి చలి తీవ్రత కొంత తగ్గింది. రాత్రి టెంపరేచర్లు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది వాయుగుండంగా మారి బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. చలి తీవ్రత తగ్గి.. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక, ఈ అల్పపీడనం ప్రభావంతో సోమవారం నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే చాన్స్​ ఉందని తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -