- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హీరో అక్కినేని నాగచైతన్య రాబోయే చిత్రం NC24 టైటిల్‌ను ‘వృషకర్మ’గా ప్రకటించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ టైటిల్‌ను ఆవిష్కరించారు. ‘వృషకర్మ’ అంటే కార్యసాధకుడు అని అర్థం. కార్తీక్ దండు దర్శకత్వంలో వస్తున్న ఈ మైథికల్ థ్రిల్లర్‌లో నాగచైతన్య నిధి అన్వేషకుడిగా, మీనాక్షి చౌదరి ఆర్కియాలజిస్ట్‌గా, స్పర్ష్ శ్రీవాత్సవ విలన్‌గా నటిస్తున్నారు. సుకుమార్ కథను అందిస్తుండగా, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
- Advertisement -



