Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం..

మహిళల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం..

- Advertisement -

ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను పంపిణీ చేసిన ఎమ్మేల్యే
నవతెలంగాణ – తిమ్మాజిపేట
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అనేక అవకాశాలు అందిస్తుందని ప్రభుత్వ సహాయం సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచికుల్ల రాజేష్ రెడ్డి అన్నారు. ఆదివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఉన్న రైతు వేదికలో మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతే ధ్యేయంగా ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు చీరలను  ఎమ్మేల్యే పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో స్వయం ఉపాధితో పాటు వ్యాపార రంగంలో మహిళలకు సహకారం అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణలోని కోటి మంది మహిళలకు కోటి చీరలను పంపిణీ చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఈ చీరలను రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లోని చేనేత కార్మికుల సంఘాలు ఇందిరా మహిళా శక్తి చొరవ కింద తయారు చేస్తున్నాయి.

స్థానిక చేనేత పరిశ్రమకు ఉపాధి కల్పిస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ప్రామాణికంగా పంపిణీ చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకం అందించడం. జీరో వడ్డీ రుణాలు పంపిణీ చేస్తూ మహిళా సంఘాలకు పెట్రోల్ బంక్‌లు, సోలార్ పవర్ ప్లాంట్స్ కేటాయించి ఇందిరా మహిళా శక్తి మండల సమైక్య పేరుతో మహిళా సంఘాలకు బస్సులు కొనుగోలుకు ఆర్థిక సహాయం అందిస్తుందని తెలిపారు. అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకంలో లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఆడబిడ్డల పేరుతో ఉచితంగా ఇస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్డిఓ చిన్న ఓబులేసు డిపిఎం కృష్ణ ఏపీఏం నిరంజన్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లయ్య పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి మార్కెట్ డైరెక్టర్ మాధవులు నాయకులు భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, దేవస్వామి, షేక్ ముబారక్ బెన్నీ రాము నాయక్ మండల సమైక్య అధ్యక్షురాలు అమృత సిసి లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -