Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి..

గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి..

- Advertisement -

గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు
నవతెలంగాణ –  తిమ్మాజిపేట

గత కొన్ని ఏళ్లుగా గ్రామ పంచాయతీని నమ్ముకుని పనిచేస్తున్న గ్రామ గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేయాలి యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆదివారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఆవరణంలో గ్రామపంచాయతీ మండల జనరల్ బాడీ సమావేశం నిర్వహించరు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి యూనియన్ జిల్లా అధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత కొన్ని ఏళ్లుగా గ్రామ పంచాయతీని నమ్ముకుని పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని నేటికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదన్నారు.

ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెర్మనెంట్ చేయాలని అన్నారు. 2 నెలలుగా వేతనాలు రాకపోవడంతో కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా మరి చాలీచాలని వేతనాలతో పూట గడడమే కష్టంగా ఉన్న ఈ రోజులలో రెండు మూడు నెలలకు ఒకసారి వేతనాలు ఇవ్వడం వలన పంచాయతీ సిబ్బంది ఎన్నో ఆర్థిక ఇబ్బందులు  ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే గ్రీన్ ఛానల్ ద్వారా నెల నెల ఐదు తారీకు న వేతనాలు వచ్చే విధంగా చేసి గ్రామ పంచాయతీ సిబ్బంది పర్మనెంట్ చేసి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం ఇన్సూరెన్స్ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వెలుగొండ రాములు మండల బాలరాజు, సత్యం, మైపాల్, వెంకటయ్య, జంగయ్య, రాజు, శంకర్, కృష్ణయ్య, బుచ్చన్న, ఎల్లయ్య, లక్ష్మమ్మ, నరసమ్మ, కమలమ్మ, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -