నవతెలంగాణ – బల్మూర్
మండల పరిధిలోని వీరంరాజు పల్లి గ్రామంలో క్రీడా మైదానం పనులకు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ యువకులు క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని అడిగిన వెంటనే క్రీడా మైదానం ఏర్పాటుకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ శివారులో గల సర్వే నెంబర్ 80 లో ఐదు ఎకరాల భూమిని క్రీడాకారుల కోరిక మేరకు ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. క్రీడా మైదానం కొరకై ఒక కోటి 50 లక్షల రూపాయల ఖర్చుతో మైదానం అన్ని హాంగులతో ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు మల్ రెడ్డి వెంకట్ రెడ్డి, బుచ్చన్న, రామస్వామి గౌడ్, తాజా మాజీ సర్పంచ్ ఎల్లికంటి శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు మహమూద్, మల్లేష్, క్రీడాకారులు గంగపుత్ర నరసింహ, భాస్కర్, నారాయణ, మల్లేష్ గౌడ్, ఎల్లికంటి శ్రీనివాసులు, అంజి గౌడ్, శ్రావణ్, కృష్ణ, ప్రభు, పవన్, గణేష్, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



