Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళల అభివృద్దే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

మహిళల అభివృద్దే ప్రజా ప్రభుత్వ ధ్యేయం..

- Advertisement -

నవతెలంగాణ – చండూరు 
రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం అనేక రకాలుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మునుగోడు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కంచుకట్ల  సంపత్ అన్నారు. ఆదివారం గట్టుప్పల మండలంలోని నామాపురం గ్రామంలో  ప్రభుత్వం అందించిన చీరలను ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. 18 సంవత్సరాల నిండిన తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ ఫ్లోరోసిస్ విముక్తి  పోరాట సమితి కంచుకట్ల సుభాష్, మహాలక్ష్మి దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ చెనగోని యాదయ్య, భీమనపల్లి రాములు మాజీ ఉపసర్పంచ్ రాములు ,  నామాపురం మాజీ మండల ప్రాదేశిక సభ్యులు భీమనపల్లి రాములు  , సురిగి వెంకటయ్య, మద్ది లింగయ్య, సమబంధం అధ్యక్షురాలు అయితరాజు సంధ్య , మహిళా సంఘాల ఆర్గనైజర్ భీమనపల్లి భారతమ్మ, వీరమల్ల లింగయ్య, దేవునపల్లి ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -