Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళలు బలపడితే సమాజమే బలపడుతుంది

మహిళలు బలపడితే సమాజమే బలపడుతుంది

- Advertisement -

– డిఆర్డిఏ అడిషనల్ పీడీ మధుసూదన్
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మహిళే కుటుంబానికి దీపం, ఆ మహిళ బలపడితే సమాజమే బలపడుతుందని డిఆర్డిఏ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ అన్నారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో గ్రామ మహిళ సమాఖ్య భవనంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బషీరాబాద్, కోన సముందర్ గ్రామాల్లో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో డిఆర్డిఏ అడిషనల్ ప్రాజెక్టు డైరెక్టర్ మధుసూదన్ ముఖ్యఅతిథిగా పాల్గొని మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.

కార్యక్రమలో అడిషనల్ పీడీ మధుసూదన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం మహిళల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందన్నారు.ప్రతి మహిళా ఈ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని కుటుంబ ఆర్థిక స్థితిని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి గ్రామాల్లో ఇందిరమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నరసయ్య ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఉన్నతి కోసం ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు నాణ్యమైన చీరలను ప్రత్యేకంగా తయారుచేయించి పంపిణీ చేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం కిరణ్ కుమార్, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి,సీసీలు అడెల్లి రవి, పిర్యా నాయక్, నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐకెపి మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -