Sunday, November 23, 2025
E-PAPER
Homeకరీంనగర్జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సంగీతం..

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సంగీతం..

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా సంగీతం శ్రీనివాస్ నియామకం జరుపుతున్నట్లు ఏఐసీసీ కార్యదర్శి కే సి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. సంగీతం శ్రీనివాస్ సుమారు 37 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు. పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటాడు. ఆయన 1988లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పట్టణ యూత్ అధ్యక్షునిగా పనిచేశారు 1995లో ఏడాది జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఆయన పని చేశారు. 1998లో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రచార కన్వీనర్ గా 2000 సంవత్సరంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఆయన పని చేశారు. 2005 నుంచి2011 వరకు సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆయన సేవలు అందించారు. అనంతరం సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎక్కువ కాలం ఆయన పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యునిగా పనిచేస్తుండగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి అతన్ని వరించింది. ఆయన కాంగ్రెస్ కురువృద్ధ నాయకుడు హనుమంతరావు కు ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -