Sunday, November 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ 

నిరుపేద వృద్ధులకు బియ్యం పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
రక్ష స్వచ్చంద సేవా సంస్థ, వారి ఆధ్వర్యములో పట్టణంలో విద్యా హైస్కూల్ ఆవరణలో ఆదివారం అవ్వకు బువ్వ కార్యక్రమము నిర్వహించినారు. ప్రతి నెలలో భాగంగా అతి నిరుపేద వృద్దులకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా దాదాపు 54 మంది పేదవృద్దులకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేష్ మాట్లాడుతూ.. అవ్వకు బువ్వ కార్యక్రమం ద్వారా అతినిరుపేద వృద్దుల ఆకలి తీర్చడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. రక్షా స్వచ్చంధ సేవా సంస్థ తరపున త్వరలో మరిన్ని సేవాకార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, విద్యా గోపికృష్ణ పట్వారి, కోశాధికారి గొనె శ్రీధర్, కార్యనిర్వహక కార్యదర్శులు డా.బేతు గంగాధర్, తులసి పట్వారి, మీర శ్రావణ్ సభ్యులు మక్కల సాయినాథ్, గోక శరత్, ఖొడే శ్రీనివాస్, విష్ణు, సాయి, కళ్యాణ్, రాజేష్, సంజీవ్, తదితరులు పాల్గొన్నారు .

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -