- Advertisement -
యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
కార్మికవర్గాన్ని కార్పొరేట్ యాజమాన్యాలకు బానిసగా మార్చేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన కార్మిక కోడ్లను తీసుకువచ్చిందని, వాటిని వెంటనే రద్దు చేయాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నూతన కార్మిక కోడ్ చట్టాలను రద్దుచేసే వరకు యువైఏప్ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. నూతనంగా తీసుకువచ్చిన లేబర్ కోడ్లు కార్మికుల హక్కులు హరించే విధంగా ఉన్నాయన్నారు. వాటిని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు.
- Advertisement -



