Sunday, November 23, 2025
E-PAPER
Homeఖమ్మందక్షిణభారత విజ్ఞానయత్రలో స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్ధులు

దక్షిణభారత విజ్ఞానయత్రలో స్థానిక వ్యవసాయ కళాశాల విద్యార్ధులు

- Advertisement -

– మైసూర్  సీ.ఎఫ్.టీ.ఆర్.ఐ సందర్శన
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కు చెందిన అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల – 2023 బ్యాచ్, మూడవ సంవత్సరం చదివే 102 మంది వ్యవసాయ విద్యార్థులు ఈ నెల 23 నుండి డిసెంబర్ 2 వరకు పది రోజుల పాటు దక్షిణ భారత విజ్ఞాన యాత్ర పాల్గొంటున్నారు. ఈ యాత్ర టూర్ లీడర్ లు కళాశాల ప్రొఫెసర్స్  డాక్టర్ కె.శిరీష, డాక్టర్ టి.శ్రావణ కుమార్,డాక్టర్ ఎ. శ్రీ జన్,కే. స్రవంతి లు వ్యవహరిస్తున్నారు. ఈ పది రోజులు పాటు కర్నాటక,తమిళనాడు, కేరళ లోని వివిధ వ్యవసాయ, ఉద్యాన పరిశోధన స్థానాలు, కేంద్ర రాస్ట్ర స్థాయి సంస్థ లను సందర్శిస్తారు. 

ఇందులో భాగంగా మొదటి రోజు ఆదివారం మైసూరు లోని సీ.ఎఫ్.టీ.ఆర్.ఐ(సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ –  కేంద్రీయ ఆహార సాంకేతిక పరిశోధన స్థానాన్ని సందర్శించారు. ఈ సీఎఫ్టీఆర్ఐ లో నూతన ఆహార ఉత్పత్తులు,భద్రత, ప్రాసెసింగ్ విధానాలపై ముఖ్యమైన పరిశోధనలు జరుగుతుంటాయి.

ధాన్యాలు,పప్పులు,నూనె గింజలు,పండ్లు,కూరగాయల ప్రాసెసింగ్‌ లో అభివృద్ధి,ఆహార సాంకేతికత, పరిశ్రమ పైన దేశవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వ్యవసాయ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, పరిశోధనావకాశాలు,ప్రాజెక్టులు నిర్వహిస్తుంటారు. భారతదేశంలోనే ఈ సీఎఫ్టీఆర్ఐ ఆహార శాస్త్రం, ఆహార సాంకేతికత కు సంబంధించిన ప్రముఖ పరిశోధనా సంస్థ.ఇది సీఎస్ఐఆర్ (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండిస్ట్రియల్ రీసెర్చ్ – శాస్త్రం సాంకేతిక,పరిశ్రమ,పరిశోధనా మండలి ) ఆధ్వర్యంలో పనిచేస్తుంది.సీఎఫ్టీఆర్ఐ దేశ ఆహార పరిశ్రమ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది,అంతేగాక ఇతర అనేక రంగాల్లో సేవలు అందిస్తుంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -