ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్
నవతెలంగాణ – టేకుమట్ల
మహిళ సాధికారితే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని, రాష్ట్రంలోని మహిళలందరికీ చీర, సారె పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వ సాంప్రదాయమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆదివారం మండలంలోని పిఎంఆర్ఎం గార్డెన్ లో ధనలక్ష్మి మండల సమాఖ్య అధ్యక్షురాలు గువ్వాడి రజిత అధ్యక్షతన ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయనన పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు. అదేవిధంగా మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ఉన్నారని తెలిపారు. కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం, గృహ జ్యోతి పథకం కింద 2 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు ఉచిత గ్యాస్ సిలిండర్, అందిస్తుందన్నారు. సొంత ఇల్లు లేని మహిళలకు ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గ్రామ సంఘాల నుండి రెండు లక్షల రుణ సదుపాయం, మహిళా సంఘాల మహిళలకు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు,సోలార్ విద్యుత్ ప్లాంట్లులను మహిళలకు అవకాశం కల్పించిందన్నారు.
రాష్ట్రంలో కోటి మంది మహిళ గ్రూపుల సభ్యులు కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని, పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మహిళలు ఆకాశమే హద్దుగా ఎదిగే విధంగా సంకేతాన్నిచ్చేలా చీరలకు ఆకాశం రంగును ఎంచుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తామని ఎవరు ఆందోళన చెందద్దని అన్నారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపించేశారు.
ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి మండల సమైక్య అధ్యక్షులు, చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి సత్యం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం, జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి పులి తిరుపతిరెడ్డి, మాజీ జిల్లా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండ శ్రీకాంత్, జిల్లా నాయకులు తోట గట్టయ్య, మాజీ ఎంపిటిసి ఆది రఘు, దొంతుల శ్రీనివాస్, తాహాసిల్దార్ విజయలక్ష్మి, ఏపిఎంమంజుల,మండల వివోఏల అధ్యక్షురాలు ఎల్లంకి సుమతి, గ్రామ దీపికలు కొండ్ర రమేష్, భూపెల్లి విజయ, స్వరూప, సింగిరెడ్డి స్వాతి, మానస, జంజిరాల సమ్మయ్య, శ్రీలత, స్వాతి, సంధ్య, స్వప్న, శైలజ, భాగ్య, సరోజన సాంబశివడు, శ్రీనివాస్ రెడ్డి , అధిక సంఖ్యలో మహిళలు,తదితరులు పాల్గొన్నారు.



