- Advertisement -
1.గాలి విసురుగా తాకింది
చెట్టు గజ గజా వణికింది
నా మనసు విల విల లాడింది
2.తలుపు తెరిచాను
ఇల్లంతా నిశ్శబ్దం.
మనసు తలుపు
కూడా తెరిచాను
రెంటిలో శూన్యం
3.సాయంత్రానికి రోజు ముగిసింది
కిటికీలోంచి సన్నని చీకటి
నా లోనెక్కడో
చిరు ప్రేమ వెలుగు
4.పెద్ద బండ రాయి పైన పడ్డ
ఆ నీడ ఎవరిది?
అలా నడిచిపోతున్న కాలానిదా
5.పాత పుస్తకం పేజీల్ని తిరగేస్తే
ఎదో గమ్మత్తయిన వాసన
పాత అక్షరాలదా…
నా బాల్యానిదా
- వారాల ఆనంద్, 9440501281
- Advertisement -



