Monday, November 24, 2025
E-PAPER
Homeదర్వాజఅమిత ప్రభావవంతం ఈ పుస్తకం

అమిత ప్రభావవంతం ఈ పుస్తకం

- Advertisement -

పుస్తకం మంచి నేస్తం అంటారు. పుస్తకం మార్గదర్శి కూడా. మనం జీవనంలో ఎలా నడుచుకోవాలో, దారిని చూపిస్తుంది. ఎన్నో పుస్తకాల్ని చదివాన్నేను. అయితే, బ్రెజిల్‌కు చెందిన పాలో కొయిలో రాసిన ‘ద ఆల్‌కెమిస్ట్‌’ పుస్తకం నా మీద చాలా ప్రభావాన్ని ప్రసరిస్తోంది. ఈ నవలను ‘పరుసవేది’ అనే పేరును పెట్టి, తెలుగులో కె. సురేశ్‌ తిరగరాశాడు. ఈ రచన్ని చదువుతూ ఉన్నప్పుడు, ఏకధాటిగా చదివేశా. తరువాత మళ్లీ మళ్లీ చదివా. మీరు ఏదయినా గట్టిగా అనుకుంటే, ఈ విశ్వమంతా మీకు అనుకూలంగా దాదాపు కుట్ర చేసినంత పన్జేసి, మీ కోరిక నెరవేరేట్టుగా తోడ్పడుతుంది అని పాలో కొయిలో రాశాడు. అలాగ నా జీవనంలో అయితే కాలేదు. కానీ, చాలా మంది జీవనంలో ఖాయంగా అది జరగొచ్చని మట్టుకు నాకనిపిస్తుంటుంది.

సంకల్పాన్ని, పట్టు పట్టి కృషి చేస్తే సాధించుకో వచ్చును. 1951వ సంవత్సరంలో విడుదల అయిన విజయ వారి ‘పాతాళ భైరవి’ తెలుగు సినేమా కథా దాదాపు ఇంతేబీ కదా. ఇదే మాటల్ని సురేశ్‌తో అన్నాను. ఆయన స్పందించ లేదు. మన చుట్టూరా ఉండే ప్రకతి మనకు కొన్ని సందేశాలను వెలువరిస్తూ ఉంటుందనీ, వాటిని మనం అర్థం చేసుకోవాలనీ పాలో కొయిలో చెబుతాడు. ఇది, మన మనస్సు మాటను మనం వినడం లాంటిదే. మనస్సాక్షిని చంపేసి బ్రతుకుతున్న వాళ్లకు ఇలాంటివి పట్టవనుకోండి. ఏమైనా, ఈ పుస్తకం ప్రతి ఒక్కరి జీవనంలో ప్రవేశించాలని కోరుకుంటున్నా. ఎప్పుడేనా ఓ మూడు గంటలు తీరిక దొరికి, ఈ పుస్తకాన్ని చదువుతంటే, గొప్ప అనుభూతులు సొంతమవడం మాత్రం తథ్యం సుమా.

  • దిలీప్‌, 8008552647
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -