- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కాళేశ్వరం సరస్వతి నది పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. పుష్కర ఘాట్‌లో మూడో రోజు పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రత్యేక హెలికాప్టర్‌లో కాళేశ్వరానికి చేరుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పుణ్య స్నానం ఆచరించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
- Advertisement -