Monday, November 24, 2025
E-PAPER
Homeఆటలుముగిసిన సిఆర్‌వైఏ క్రికెట్‌ లీగ్‌

ముగిసిన సిఆర్‌వైఏ క్రికెట్‌ లీగ్‌

- Advertisement -

విజేతగా నిలిచిన డిజైన్‌వాల్స్‌
హైదరాబాద్‌ :
సిఆర్‌వైఏ క్రికెట్‌ ప్రీమియర్‌ లీగ్‌ రెండో సీజన్‌ విజేతగా డిజైన్‌వాల్స్‌ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో క్రైస్ట్‌ వారియర్స్‌ జెఎంజెపై డిజైన్‌వాల్స్‌ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. టైటిల్‌ పోరులో తొలుత బ్యాటింగ్‌ చేసిన డిజైన్‌వాల్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. క్రితార్థ్‌ తుమ్మ (84), కిరణ్‌ కుమార్‌ రెడ్డి తుమ్మ (51) అర్థ సెంచరీలతో రాణించారు. ఛేదనలో దీరజ్‌ రెడ్డి (52), అజరు రెడ్డి (44) మెరిసినా క్రైస్ట్‌వారియర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 185 పరుగులే చేసింది. క్రితార్థ్‌ తుమ్మ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు. గోపు బాలరెడ్డి, సింగరెడ్డి షోరెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -