వన్డే జట్టులో తిలక్, నితీశ్
సఫారీ సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
నవతెలంగాణ-ముంబయి : భారత క్రికెట్‌లో తెలుగు వెలుగు. జాతీయ జట్టులో తెలుగోళ్ల ప్రాతినిథ్యం క్రమంగా మెరుగవుతోంది. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు తెలుగు రాష్ట్రాల నుంచి ఇద్దరు క్రికెటర్లు ఎంపికయ్యారు. హైదరాబాదీ తిలక్ వర్మ, ఆంధ్రావాలా నితీశ్ కుమార్ రెడ్డి భారత వన్డే జట్టులో చోటు సాధించారు. భారత్, దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ నవంబర్ 30న రాంచి మ్యాచ్‌తో ఆరంభం కానుంది. డిసెంబర్ 3న రారుపూర్‌లో రెండో వన్డే, 6న విశాఖపట్నంలో ఆఖరు వన్డే జరుగ నుంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ గాయం నుంచి కోలుకోలేదు. దీంతో కెఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. శ్రేయస్ అయ్యర్ ప్లీహం గాయం నుంచి కోలుకుంటున్నాడు. అతడిని సెలక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పేస్ దళపతి జశ్‌ప్రీత్ బుమ్రాకు సెలక్షన్ కమిటీ విశ్రాంతి అందించింది. సీనియర్ పేసర్లు మహ్మద్ షమి, మహ్మద్ సిరాజ్‌లకు మరోసారి నిరాశ తప్పలేదు.
రాహుల్‌కు కెప్టెన్సీ
ఈడెన్‌గార్డెన్స్ టెస్టులో మెడ గాయానికి గురైన శుభ్‌మన్ గిల్ కోలుకోలేదు. వన్డే సిరీస్‌కు గిల్ దూరమయ్యాడు. గత వన్డే సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ ఆసీస్ పర్యటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్లీహం శస్త్రచికిత్స అనంతరం అయ్యర్ కోలుకుం టున్నాడు. దీంతో 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వికెట్ కీపర్, బ్యాటర్ కెఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. రెండో వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ వన్డే జట్టులో తిరిగి చోటు సాధించాడు. మరో వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. స్పెషలిస్ట్ బ్యాటర్‌గా జట్టులో నిలిచాడు. శుభ్‌మన్ గిల్ స్థానంలో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ జట్టులోకి రాగా.. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. విరాట్ కోహ్లితో కలిసి తెలుగు తేజం తిలక్ వర్మ మిడిల ఆర్డర్‌లో బ్యాటింగ్ బాధ్యతలు పంచుకోనున్నాడు. స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లు.. పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, ప్రసిద్ కృష్ణలు జట్టులో నిలిచారు. పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి జట్టులో స్థానం నిలుపుకున్నాడు. భారత్-ఏ తరఫున ఇటీవల ఆకట్టుకున్న రుతురాజ్ గైక్వాడ్ టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా జట్టులో చోటు సాధించాడు.
తెలుగు వెలుగు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



