అగ్రకథానాయకుడు ప్రభాస్ కొత్త మూవీ ‘స్పిరిట్’ ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్ర ముహూర్త వేడుకకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరై, క్లాప్ కొట్టారు. దీంతో ఈసినిమాకి సంబంధించి తొలి షెడ్యూల్ ఆరంభమైంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాన్-వరల్డ్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించబోతున్నారు. టీ-సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనుంది. సందీప్ రెడ్డి వంగా బ్లాక్ బస్టర్ ‘యానిమల్’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న త్రిప్తి దిమ్రి ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడిగా నటించనుంది. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్, ప్రముఖ నటి కాంచన కీలక పాత్రల్లో కనిపిస్తారు. ప్రభాస్ పుట్టినరోజున నిర్మాతలు ఇటీవల ఒక ప్రత్యేకమైన ‘సౌండ్-స్టోరీ’ ఆడియో టీజర్‌ను రిలీజ్ చేశారు. ఎటువంటి విజువల్స్ లేనప్పటికీ ఈ వీడియోకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘స్పిరిట్’ను ప్రపంచవ్యాప్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్‌గా రూపొందిస్తున్నారు. తొమ్మిది భాషలలో విడుదల చేయబోతున్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడిని సర్‌ప్రైజ్ చేసిన చిరు..
డైరెక్టర్ అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలపడంతోపాటు ఒక అందమైన వాచ్‌ని గిఫ్ట్‌గా అందించి, సర్‌ప్రైజ్ చేశారు. అంతేకాదు కేక్ కట్ చేసి బర్త్‌డేని కూడా సెలబ్రేట్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సింగిల్ మీసాల పిల్ల’ రికార్డ్ బ్రేకింగ్ వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాహూ గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రభాస్ ‘స్పిరిట్’ ఘనంగా ప్రారంభం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



