Monday, November 24, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయం44 రోజులు.. 500 సార్లు కాల్పుల ఉల్లంఘన

44 రోజులు.. 500 సార్లు కాల్పుల ఉల్లంఘన

- Advertisement -

ఇజ్రాయిల్‌ దాడుల్లో వందలాది మంది పాలస్తీనియన్ల మృతి
గాజా : కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ట్రంప్‌ ప్రకటన చేశాక..గాజాలో ఇజ్రాయిల్‌ బరితెగిస్తూనే ఉన్నది. అక్టోబర్‌ 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇజ్రాయిల్‌ 44 రోజుల్లో కనీసం 497 సార్లు భద్రతా హద్దులు దాటింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన గాజా కాల్పుల విరమణను ఉల్లంఘించిందని, వందలాది మంది పాలస్తీనియన్లను చంపిందని గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఈ దాడుల్లో దాదాపు 342 మంది పౌరులు మరణించారు, బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలు , మహిళలు, వృద్ధులు ఉన్నారు. ఇజ్రాయిల్‌ తన ఉల్లంఘనల వల్ల కలిగే మానవతా, భద్రతా పరిణామాలకు పూర్తిగా బాధ్యత వహించాలని కూడా ఆ కార్యాలయం పేర్కొంది. ఇజ్రాయిల్‌ 330 మృతదేహాలను తిరిగి ఇచ్చిందని, 90 మృతదేహాలను మాత్రమే గుర్తించామని ప్రతినిధి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -