Monday, November 24, 2025
E-PAPER
Homeజాతీయం'సింధ్‌ మళ్లీ భారత్‌లో కలవొచ్చు'

‘సింధ్‌ మళ్లీ భారత్‌లో కలవొచ్చు’

- Advertisement -

కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : భారత్‌-పాకిస్తాన్‌ సరిహద్దుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చని, రేపు సింధ్‌ ప్రాంతం భారత్‌లో తిరిగి చేరుతుందేమో ఎవరికి తెలుసని వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘సింధీ సమాజ్‌ సమ్మేళన్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మాజీ ఉపప్రధాని అద్వానీ చెప్పిన మాటలను ప్రస్తావించారు. నాగరికత పరంగా చూస్తే, సింధ్‌ ఎప్పుడూ భారత్‌లోనే అంతర్భాగంగా ఉంటుంది. ”సింధూ నదిని పవిత్రంగా భావించే మన సింధ్‌ ప్రజలు ఎప్పుడూ మనవారే. వారు ఎక్కడ ఉన్నా, వారు ఎప్పుడూ మనకు చెందినవారే” అని ఆయన ఉద్వేగంగా అన్నారు. భూమి విషయానికొస్తే సరిహద్దులు ఎప్పుడైనా మారవచ్చు. రేపు సింధ్‌ మళ్లీ భారత్‌లో చేరుతుందేమో ఎవరికి తెలుసు.”అని కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -