Saturday, May 17, 2025
Homeజాతీయంవివాహేతర సంబంధంపై హైకోర్టు సంచలన తీర్పు

వివాహేతర సంబంధంపై హైకోర్టు సంచలన తీర్పు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వివాహేతర సంబంధం విషయంలో విడాకులు కోరుతూ..కోర్టుకెక్కిన భార్యాభర్తలకు అహ్మదాబాద్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ లోని సబర్మతి ప్రాంతానికి చెందిన వ్యక్తి, గాంధీనగర్ కు చెందిన మహిళను 2006లో వివాహం చేసుకుని, ఆ తర్వాత వారు అబుదాబిలో కాపురం పెట్టారు. 2012లో వారికి ఒక బాబు పుట్టాడు. అయితే ఇంతలో ఏమైందో గానీ భర్త తనను వేధించాడని, గొడవల కారణంగా భర్తతో ఉండలేక 2016లో తాను ఇండియాకు తిరిగివచ్చానని భార్య కోర్టుకు తెలిపింది. 2017లో సబర్మతి పోలీస్ స్టేషన్‌లో ఆమె తన భర్తపై ఎఫ్‌ఐఆర్ కూడా దాఖలు చేసింది. దీంతో భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. భార్య అహ్మదాబాద్‌లోని ఫ్యామిలీ కోర్టులో భరణం కావాలని భార్య పిటిషన్ వేసింది. 2023 జనవరి 20న కోర్టు వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే అంతకుముందు ఆమెకు, వారి కుమారుడికి కలిపి నెలకు రూ. 40 వేలు భరణం, ఇంటి అద్దె కింద మరో రూ.20 వేలు చెల్లించాలని ఆదేశించింది. అంతేకాకుండా పరిహారం కింద రూ.25 లక్షలు కూడా చెల్లించాలని భర్తను ఆదేశించింది. విచారణ తర్వాత ఆ మహిళ గృహ హింసకు గురైందని గుర్తించింది. అయితే తాను ఏ పనీ లేకుండా ఖాళీగా ఉన్నానని.. భరణం చెల్లించుకోలేనని ఆమె భర్త వాదించాడు. కానీ ఆ వాదనను కోర్టు నమ్మలేదు. యూఏఈలో రెండో భార్యతో జీవిస్తున్న వ్యక్తి భరణం తప్పించుకునేందుకే తాను నిరుద్యోగి అని వాదించాడని తేల్చింది. దీంతో భార్యకు భరణం చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -