- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తమిళనాడులో టెన్‌కాశీలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అచ్చంపట్టి సమీపంలో రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కనీసం ఎనిమిది మంది మృతి చెందగా, 42 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



