Monday, November 24, 2025
E-PAPER
Homeఖమ్మంసర్పంచ్ రిజర్వేషన్ లు ఖరారు

సర్పంచ్ రిజర్వేషన్ లు ఖరారు

- Advertisement -

– మండలంలో మొత్తం 27 పంచాయితీలు
నవతెలంగాణ – అశ్వారావుపేట

పంచాయితీ సాదారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికారులు పంచాయితీలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో మూడో సాధారణ ఎన్నికలు నిర్వహించనున్నారు. 2014 మొదటి దఫా పంచాయితీ ఎన్నికల్లో మండలంలో 16 పంచాయితీలు ఉండగా 2018 ఎన్నికల్లో నాటి ప్రభుత్వం తండాలను సైతం నూతన పంచాయితీలుగా విస్తరించడంతో 30 పంచాయితీలు ఏర్పాటు అయ్యాయి.

ప్రస్తుతం 2025 లో అశ్వారావుపేట తో పాటు పేరాయి గూడెం,పాతల్లిగూడెం లు కలుపుకుని అశ్వారావుపేట మున్సిపాల్టీ గా నేడున్న ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో 27 పంచాయితీలకు రిజర్వేషన్ లు ఖరారు చేసారు. అనంతారం, ఆసుపాక, గుమ్మడవల్లి, కోయ రంగా పురం, మల్లాయిగూడెం, నందిపాడు, నారం వారిగూడెం, నారంవారిగూడెం కాలని, నారాయణపురం, పాతరెడ్డిగూడెం, వేదాంతపురం, కేశప్పగూడెం పంచాయతీలు గిరిజన మహిళలకు రిజర్వు అయ్యాయి.

అచ్యుతాపురం, బచ్చువారిగూడెం, దిబ్బగూడెం, గాండ్లగూడెం, జమ్మిగూడెం, కన్నాయిగూడెం, కావడిగుండ్ల, కొత్త మామిళ్ల వారిగూడెం, మద్దికొండ, మొద్దులమడ, రామన్నగూడెం, తిరుమలకుంట, వినాయక పురం, పంచాయతీలు గిరిజన జనరల్( మహిళ – పురుషులకు) రిజర్వు చేశారు. ఊట్లపల్లి జనరల్ మహిళ, పాత అల్లి గూడెం జనరల్ (అన్రిజర్వడ్) మహిళ – పురుషుల స్థానంగా ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -