Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలీస్ యంత్రాంగానికి నిబంధనలు వర్తించవు..

పోలీస్ యంత్రాంగానికి నిబంధనలు వర్తించవు..

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
పోలీస్ యంత్రాంగానికి నిబంధన వర్తించదు… ప్రజలకు మాత్రమే వర్తిస్తుంది… మాకు రూల్స్ తో పనిలేదు.. ప్రజలు మాత్రం రూల్స్ ఫాలో కావాలి,. మేము రోడ్డు  అడ్డంగా వాహనాలను నిలబెడతాం. మమ్మల్ని ఎవరు అడగకూడదు. రోడ్డుపైన వెళ్లే వాహనా దారులకు వెంటపడి మరి పట్టుకుంటాం… అదే మా డ్యూటీ, ఫైవిధి ఎక్కడ ట్రాఫిక్ విధులు నిర్వర్తించారు..

మేము ఎక్కడ ట్రాఫిక్ ని కంట్రోల్ చేయవలసిన పనిలేదు ఎక్కడ విధిగా రూల్స్ ప్రకారం పట్టించుకోవాల్సిన పనిలేదు మాకు ఎవరు అడుగుతారు మేము రోడ్డుకి అడ్డంగానే పెడతాం అనే విధంగా వ్యవహరిస్తున్నారు నిజామాబాద్ నగరంలోని సోమవారం కంటేశ్వర్ మీసేవ సెంటర్ వద్ద ఒక కానిస్టేబుల్ ఆయన వ్యక్తిగత ఫోన్ తో ఫోటోలు తీస్తున్నారు, పోలీస్ యంత్రాంగానికి కెమెరాలు ఉండవు. అదే సమయంలో ఎల్లమ్మ గుట్ట చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు ఒకే చోట 5,6 గురు నిలబడి ఫైన్ లు విధించడం, ట్రాఫిక్ పోలీసుల పని టార్గెట్ లను భర్తీ చేయడమే వాహనాదారు ముందుకు వెళ్తుంటే మరి పరిగెత్తుకెళ్లి వాహనాదాలను పట్టుకుంటున్నారు.

పూలంగ్ చౌరస్తా వద్ద నాలుగో టౌన్ పోలీసులు , పోలీస్ వాహనాన్ని రోడ్డు పైన వాహనాన్ని నిలబెట్టి కచ్చితంగా ఫైన్ కట్టాలి లేదంటే.., మరో ఫైన్ వేసుకోవాలి అని గట్టిగా బెదిరిస్తూ ఫైన్ లు వేస్తాం లేదంటే ఇప్పుడే పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తామనాడం అనే విధంగా ప్రజలను దొంగల్లాగా వ్యవహరిస్తున్నారు. కానీ అసలైన దొంగలను వారికున్న కేసులను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని నగర ప్రజలు ఆరోపణ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -