- Advertisement -
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి
నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ ను సోమవారం సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సాధారణంగా శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎస్పీని కోరారు. సన్మానించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. శ్రీనివాసులు, కందికొండ గీత, నర్సింహులు, రామయ్యలు ఉన్నారు.
- Advertisement -



