– కోర్టు ఆదేశాలతో మళ్ళీ బాధ్యతలు
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండలంలోని కోనా సముందర్ సొసైటీ చైర్మన్ సామ బాపురెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొన్ని నెలల క్రితం జిల్లా డిసిసిబి అధికారులు బాల్కొండ నియోజకవర్గంలో 20 సొసైటీలో 12 మంది చైర్మన్లను, పాలకవర్గాన్ని తొలగించారు. ఈ తొలగింపుపై 12 మంది చైర్మన్ లు, డైరెక్టర్లు కలిసి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వారికి అనుకూలంగా ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా సహకార అధికారి ఉత్తర్వుల మేరకు సామ బాపు రెడ్డితో సహా పదవి కోల్పోయిన 12 మంది డైరెక్టర్లు తమ పదవి బాధ్యతలను మళ్లీ స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ ఆకుల రాజన్న, స్పెషల్ అధికారి బాబురావు, సొసైటీ సీఈఓ కార్తీక్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
కోనాసముందర్ సొసైటీ చైర్మన్ గా సామ బాపురెడ్డి బాధ్యతల స్వీకరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



