నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ డోంగ్లి మండలాల్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇరు మండలాల అధ్యక్షులు దరాస్ సాయిలు గజానంద్ దేశాయ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం అండగా నిలుస్తూ.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని తెలిపారు. ఈ చీరల పంపిణీ కార్యక్రమం మద్నూర్ మండలంలోని తడగూర్ అంతాపూర్ డోంగ్లి మండలంలోని కుర్ల తదితర గ్రామాల్లో పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ చీరలు పంపిణీలో మహిళా సంఘాల నాయకులతో పాటు ఐకెపి ఎపిఎం జగదీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు.
మద్నూర్, డోంగ్లి మండలాల్లో చీరల పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



