Monday, November 24, 2025
E-PAPER
Homeజిల్లాలురెండు మూడు రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి

రెండు మూడు రోజుల్లో సర్పంచ్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ : సీఎం రేవంత్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ కొడంగల్‌: రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్‌ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్నుకోవద్దని సూచించారు. అభివృద్ధి చేసే వారికే అండగా నిలవండి అని కోరారు.

సర్పంచ్‌ ఎన్నికలు అత్యంత కీలకమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మహిళలు ఆశీర్వదించాలని కోరారు. సర్పంచ్‌ ఎన్నికల కోసం రాజకీయాలను పక్కనబెట్టాలని సూచించారు. అభివృద్ధి విషయంలో అంతా ఒక్కటే అని సంకేతమివ్వాలని సూచించారు. కొడంగల్‌లో పర్యటన సందర్భంగా అక్షయ పాత్ర కిచెన్‌కు సీఎం రేవంత్‌ రెడ్డి భూమిపూజ చేశారు. అలాగే రూ.103కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో పల్లె వెలుగు బస్సును ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..రూ.5వేల కోట్లతో కొడంగల్‌లో ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌ నిర్మిస్తామని.. రాష్ట్రం నలుమూలల నుంచి చదువు కోసం కొడంగల్‌కు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు. కొడంగల్‌ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఢిల్లీకి నోయిడా తరహాలో కొడంగల్‌ మారబోతోందని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -