Monday, November 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షునికి ఘన సన్మానం

భూపాలపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షునికి ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన బట్టు కరుణాకర్ నూతన డీసీసీ అధ్యక్షులుగా నియామకం అయిన సందర్బంగా కాటారం మండల నాయకులు జిల్లా కేంద్రంలోని స్థానిక ఐన్టీయుసీ కార్యాలయంలో కరుణాకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అంగోతు సుగుణ మాట్లాడుతూ.. ముందుగా కరుణాకర్ కు శుభాకాంక్షలు తెలిపారు. మాదిగ సామజిక వర్గానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడికి డీసీసీ అధ్యక్షులు నియమించినందుకు అధిష్టానానికి ధన్యవాదములు తెలిపారు. భవిష్యత్తులో కరుణాకర్ మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రెడ్డి, కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాటారం మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కన్వీనర్ కుంభం రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చీర్ల, తిరుపతి రెడ్డి,మంత్రి నరేష్, గోమాస మధు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -