– అధైర్య పడకండి ప్రభుత్వం అండగా ఉంటుంది…
– తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకులు..
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
రైతులు ఎవరు అధైర్య పడకండి తడిసిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగం గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లి మండలంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మండలంలోని రాళ్లపేట, అంకుసాపూర్, రామనపల్లె, అంకిరెడ్డి పల్లె, పలు గ్రామాల్లో తడిసిన ధాన్యాన్ని కాంగ్రెస్ నాయకులు జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి సప్త శ్రీనివాస్ రెడ్డి, లింగాల భూపతి, శనివారం కల్లాల వద్ద పరిశీలించారు. వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉన్న వడ్లు అకాల వర్షానికి తడిచాయని, రైతులెవరు ఇబ్బంది పడవద్దని రైతులకు సూచించారు. తడిసిన ధాన్యాన్ని కూడా పూర్తిస్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఎవరు అధైర్య పడకుండా ఉండాలని ప్రభుత్వం అందరికీ అండగా ఉంటుందన్నారు.
తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES